
రైతులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● ఐఐఎంఏ పరిశోధకులు శ్రీరామ్
● రైతు ఉత్పత్తిదారుల సంఘం
సందర్శన
జక్రాన్‌పల్లి : విలువ ఆధారిత వస్తువులు తయారు చేసే అవకాశాలను రైతులు అందిపుచ్చుకోవాలని ఐఐఎంఏ(అహ్మదాబాద్) పరిశోధకులు శ్రీరామ్ సూచించారు. మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక్క టర్మరిక్ క్లస్టర్‌ను మారుమూల ప్రాంతమైన మనోహరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పసుపుతో ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చని, దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అందులో భాగంగానే జిల్లాలోని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పట్కూరి తిరుపతిరెడ్డి, నవ్యభారతి గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ సంతోష్ పాల్గొన్నారు.