
విజయాల దశమి
● నేటి ఉత్సవాలకు సర్వం సిద్ధం ● ముస్తాబైన ఆలయాలు ● నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో రావణ దహనానికి ఏర్పాట్లు
విజయాలను అందించే విజయదశమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మహిషాసురిడిని అమ్మవారు సహరించిందీ.. రావణుడితో యుద్ధం సమయంలో శ్రీరాముడికి సాక్షాత్కారం ఇచ్చింది దశమి రోజే. జిల్లా కేంద్రంలోని ఆలయాలతోపాటు ఆర్మూర్‌లోని జంబి హనుమాన్, బోధన్ పట్టణంలోని భీమునిగుట్టపై గురువారం నిర్వహించనున్న దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బుధవారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరా వేడుకలను సొంత ఊళ్లలో నిర్వహించుకునేందుకు వచ్చేశారు.
నగరంలో పండగ సందడి
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో దసరా సందడి నెలకొంది. వస్త్ర షోరూములు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. పూలు, గుమ్మడి కాయల వ్యాపారం జోరుగాసాగింది. బుధవారం వాహన, ఆయుధ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం విజయ దశమి సందర్భంగా బ్రహ్మంగారి గుడి, జంబిహనూమాన్ ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయాల్లో శమీ పూజను నిర్వహించనున్నారు. అధికారులు విజయదశమికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

విజయాల దశమి

విజయాల దశమి

విజయాల దశమి