రేపు కిసాన్‌ మిలాప్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు కిసాన్‌ మిలాప్‌

Oct 2 2025 8:39 AM | Updated on Oct 2 2025 8:39 AM

రేపు

రేపు కిసాన్‌ మిలాప్‌

విజయానికి ప్రతీక ‘దసరా’

మోర్తాడ్‌(బాల్కొండ): రాజకీయ పార్టీలు, కు ల మతాలకు అతీతంగా అన్నదాతల ఆత్మీ య కలయిక కార్యక్ర మాన్ని శుక్రవారం ఆ ర్మూర్‌ వేదికగా నిర్వహించనున్నారు. దసరా సందర్భంగా అన్ని గ్రామాల రైతులను ఏకం చేస్తూ, వారి కష్టసుఖాలను స్వ యంగా తెలుసుకునేందుకు వరుసగా రెండో సంవత్సరం ‘కిసాన్‌ మిలాప్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకెట్‌ అన్వేశ్‌ రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామాల రైతులను ఆహ్వానిస్తున్నారు. ‘కిసాన్‌ మిలాప్‌’ ద్వారా వ్యవసాయంలో జరుగుతున్న అభివృద్ధి, ఇబ్బందులు తెలుసుకోవడానికి అవకాశం ఉందని అన్వేశ్‌ రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, కేవలం రైతుల కోసమే నిర్వహించే వినూత్న సమ్మేళనమని వివిరంచారు. రైతు లు స్వయంగా హాజరుకావాలని కోరారు.

పండుగకు ముందే

అందిన వేతనాలు

బల్దియా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆనందం

నిజామాబాద్‌ సిటీ: ప్రతి నెలా 10వ తేదీ తరువాత అందే జీతాలు, ఇప్పుడు దసరాకు ముందు రోజే అందడంతో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా చరిత్రలో ఎన్నడూ ఒకటో తేదీన జీతాలు అందలేదని అంటున్నారు. సిబ్బందికి ఒక టో తేదీనే వేతనాలు ఇవ్వాలని కమిషనర్‌ ది లీప్‌కుమార్‌ అకౌంట్స్‌ సెక్షన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్‌ 20వ తేదీ నాటికే ఉద్యోగుల హాజరు, వేతనాలను సి ద్ధం చేశారు. గత నెల 28వ తేదీనే బ్యాంక్‌లో చెక్కులు డిపాజిట్‌ చేయడంతో 1వ తేదీన సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమయ్యాయి. దసరాకు ఒక రోజు ముందే జీతాలు అందడంతో ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్‌ దిలీప్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

వేల్పూర్‌: జిల్లా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి (దసరా)శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా, అన్యాయంపై గెలుపునకు సంకేతంగా విజయదశమి జరుపుకుంటామన్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, కుటుంబాల్లో ఆనందాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సీపీ శుభాకాంక్షలు..

ఖలీల్‌వాడి: జిల్లా ప్ర జలకు విజయదశమి పండుగ సందర్భంగా సీపీ పోతరాజు సాయిచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయా లని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో నిండు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కాలం గడపాలన్నారు. నిజామాబాద్‌, ఆ ర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వంసాలకు తావులేకుండా సహకరించాలని కోరారు. ప్రజలు, పోలీస్‌ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావంతో మెలగాలని సూచించారు.

రేపు కిసాన్‌ మిలాప్‌ 1
1/2

రేపు కిసాన్‌ మిలాప్‌

రేపు కిసాన్‌ మిలాప్‌ 2
2/2

రేపు కిసాన్‌ మిలాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement