
అనుబంధం.. ఆనందం
● దసరా వేడుకల కోసం స్వగ్రామానికి చేరుకున్న వ్యాపారవేత్త, రిటైర్డ్ ఏసీపీ
● మాక్లూర్ మండలం వల్లభాపూర్‌లో
సందడి చేస్తున్న రెండు కుటుంబాలు
మాక్లూర్: జీవితంలో ఎంత బిజీ ఉన్నా సొంతూ రులో దసరా వేడుకలు జరుపుకోవడం ఆ ఇద్దరికి ఎంతో ఇష్టం. తాము ఎంత బిజీ ఉన్నా, ఎక్కడ ఉ న్నా.. గ్రామంతో, గ్రామస్తులతో ఉన్న అనుబంధం తమను లాక్కొస్తుందని అంటున్నారు మండలంలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జి సుధాకర్, రిటైర్డ్ ఏసీపీ గంగాధర్.
సుధాకర్ 35 ఏళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తన మేనమామ, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జి సాయన్న సూచనల మేరకు మైన్స్ వ్యాపారంలోకి దిగి సక్సెస్ అయ్యారు. దసరా వేడుకలను మాత్రం గ్రామస్తులతో కలిసి చేసుకుంటున్నారు. గ్రామం కోసం ఏ సహాయం చేయడానికై నా ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ఏడాది కూడా భార్యా పిల్లలతో కలిసి గ్రామానికి చేరుకున్న ఆయన గ్రామస్తులతో కలిసి సందడి చేస్తున్నారు. ప్రతి ఏడాది దసరాకు సొంతూరికి వచ్చి అందరినీ కలిసి వెళ్లడం ఆనందంగా ఉంటుందని సుధాకర్ అంటున్నారు.
గ్రామం నుంచి మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఎస్ గంగాధర్ ఎస్సైగా విధుల్లో చేరి హైదరాబాద్‌లో సర్వీస్ పూర్తి చేశారు. ఏసీపీగా రిటైర్ అయిన ఆయన అక్కడే స్థిరపడ్డారు. రిటైర్ అయిన ప్రతి దసరాకు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుంటున్నారు. పిల్లలను మంచి చదువులు చది వించాలని గ్రామస్తులకు సూచించడంతోపాటు పేదలకు ప్రోత్సహకాలు అందజేస్తారు. ఈ ఏడాదిసైతం గ్రామానికి వచ్చిన ఆయన పిల్లలకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. సర్వీస్‌లో ఉన్న సమయంలో చాలా ఏళ్లపాటు గ్రామానికి రాలేకపోయానని, ధ్యాసంతా గ్రామంపైనే ఉండేదని గంగాధర్ అంటున్నారు.

అనుబంధం.. ఆనందం