
భీముని గుట్టపై..
బోధన్: పాండవులు నడియాడిన ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బోధన్ పట్టణంలోని రాకాసీపేట ప్రాంతంలోని భీమేశ్వరాలయం(భీమునిగుట్ట) విజయదశమి వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏడాది దసరా వేడుకలను గుట్టపై ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్స వాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్, ప్రస్తుత పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ కుటుంబం ఆనవాయితీగా దశాబ్దాలుగా పట్టణ ప్రముఖులతో కలిసి హోమం, ఆయుధ, జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం సైతం దసరా ఉత్సవాలకు ఆలయ అభి వృద్ధి కమిటీ ఏర్పాట్లు చేసింది.
బకాసురుడి సంహారం
వనవాస సమయంలో పాండువులు ఏకచక్రపురం (బోధన్)లోని ఓ బ్రాహ్మణ కుటుంబం వద్ద ఆశ్ర యం పొందారని, ఆ సమయంలో బకాసురుడు ప్రజలను పీడించే వాడని చరిత్రకారులు చెబుతా రు. ప్రతి రోజూ బండెడు అన్నంతోపాటు ఓ వ్యక్తి ఆహారంగా వంతుల వారీగా వెళ్లాల్సి వచ్చేదని, ఈ క్రమంలో ఓ రోజు పాండువులకు ఆశ్రమిచ్చిన బ్రా హ్మణ కుటుంబం నుంచి ఆహారం, ఓ వ్యక్తి ఆహారంగా వెళ్లాల్సి రావడంతో ఆ కుటుంబం పాండవరాజులకు తమ పరిస్థితిని మొరపెట్టుకున్నా రని, దీంతో భీమునిగుట్ట(భీమేశ్వరాలయం)పై భీ ము డు యుద్ధం చేసి బకాసురుడిని సంహరించాడని చెబుతారు.