
మూడు రోజుల్లో రూ.25 కోట్ల మద్యం..
● నేడు మూసి ఉండనున్న వైన్‌షాపులు
● మాంసం విక్రయాలూ బంద్
● రూ.3 కోట్ల విలువైన
జీవాల విక్రయం
ఖలీల్‌వాడి: జిల్లాలో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు సాగాయి. మొ త్తం 102 మద్యం దుకాణాలు ఉండగా, రో జుకు రూ.4.50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే గురువారం దసరా ఉండగా, ఇదే రోజు గాంధీ జయంతి కావడంతో వైన్‌షాపు లు, మాంసం దుకాణాలు మూసి ఉండనున్నాయి. దీంతో వైన్‌షాపుల వద్ద బారులు తీరారు. సోమ, మంగళ, బుధవారాల్లో రూ.25 కోట్ల విలువైన మద్యం విక్రయమైంది. సోమవారం రూ.4 కోట్లకు పై గా వ్యాపారం కాగా, మంగళవారం రూ.10.54 కోట్ల విలువైన, బుధవారం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలి సింది. గాంధీ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్పష్టం చేశారు.
గాంధీ జయంతి రోజున మాసం విక్రయం నిషేధమైనప్పటికీ.. దసరా ఉండడంతో మేక లు, గొర్రెల విక్రయాలు జోరుగా సాగాయి. నవీపేట్ మేకల సంతలో రూ.3 కోట్ల జీవాలు విక్రయమయ్యాయని అంచనా.