
ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో నిర్వహించే దసరా వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రావణ సంహారం ప్రదర్శన ఆకర్షణగా నిలుస్తుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన వారితోపాటు పరిసర గ్రామాల ప్రజలు హాజరై ఉత్సవాల్లో పాల్గొంటారు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించనున్నారు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణకు రథం చేరుకోగానే రాముడు బాణం విసిరి రావణుని సంహరించే సన్నివేశం ప్రారంభమవుతుంది. రామరావణ యుద్ధం ముగిసిన తరువాత ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవం కేవలం భక్తి, ఆచారం మాత్రమే కాదు, సమాజ బాంధవ్యాలను, సాంస్కతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.