
విద్యుత్ శాఖ ఫిర్యాదుల కోసం...
వాట్సాప్ నంబర్: 8333818266
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) తన వినియోగదారుల ఫిర్యాదుల కోసం మొబైల్ వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు చేయాలనుకునే వినియోగదారులు సర్వీస్ నెంబర్‌ను నమోదు చేయగానే వివరాలు వెల్లడవుతాయి. చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఒక ఐడీ వస్తుంది. ఆ వివరాలు వెంటనే వినియోగదారులకు మెసేజ్ రూపంలో అందుతాయి. ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవచ్చు. సమస్య పరిష్కరించిన తర్వాత వినియోగదారునికి ఐవీఆర్‌ఎస్ కాల్ వస్తుంది. ఫీడ్ బ్యాక్ ఇవ్వమని అడుగుతారు.