
లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు పూర్తి
● హాజరైన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్, పైడి రాకేశ్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యా యి. కంఠేశ్వర్ బైపాస్‌లోని అశోకా టౌన్‌షిప్‌లో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం నుంచి గూపన్‌పల్లిలోని వైకుంఠధామం వరకు జరిగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, విత్తనాభివృద్ధి డెవలప్‌మెంట్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్‌బిన్‌హందాన్, రైతు కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, మానాల మోహన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మండవ వెంకటేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్ తదితరులు లక్ష్మీనర్సమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఓదార్చారు. వర్ధనపేట్ ఎమ్మెల్యే నాగరాజు ఫోన్ ద్వారా భూపతిరెడ్డిని పరామర్శించారు.