
రైటర్ రాజుకు జాతీయ ప్రతిభా పురస్కారం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి, యువ రచయిత, కవి రైటర్ రాజు ‘యువ సాహితీ కిరీటి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ బిర్లామందిర్ భాస్కర ఆడిటోరియంలో శ్రీ శ్రీ కళావేదిక, ప్రపంచ తెలుగు–సంస్కృతి వేదిక, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సాహితీ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలో రైటర్ రాజు రాసిన కవితలు, వ్యాసాలు చేస్తున్న కృషిని గుర్తిస్తూ యువ సాహితీ కిరీటీ జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు. శ్రీశ్రీ కళావేదిక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్, సభ్యులు రైటర్ రాజుకు ప్రశంసాపత్రం అందజేసి శాలువా, మెమోంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజు ‘తెలుగు భాష గొప్పతనం’ శీర్షికతో కవితాగానం చేశారు.