మత్స్య శాఖలో టెండర్ల వివాదం! | - | Sakshi
Sakshi News home page

మత్స్య శాఖలో టెండర్ల వివాదం!

Sep 30 2025 8:40 AM | Updated on Sep 30 2025 8:40 AM

మత్స్య శాఖలో టెండర్ల వివాదం!

మత్స్య శాఖలో టెండర్ల వివాదం!

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా మత్స్య శాఖలో చేపపిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్లపై లొల్లి నడుస్తోంది. ఈ నెల 25న పూర్తి కావాల్సిన టెండర్లు తెరుచుకోకుండానే వాయిదా పడ్డాయి. మత్స్య శాఖ అధికారికి, కాంట్రాక్టర్లకు మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మత్స్య శాఖ ఏడీ తనకు అనుకూలంగా ఉన్న వారికే కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల మిగతా కాంట్రాక్టర్లు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం అ దనపు కలెక్టర్‌ చాంబర్‌లో జరుగుతున్న టెండర్లను రాత్రికి రాత్రే వాయిదా వేశారు. టెండర్లలో పాల్గొ న్న కాంట్రాక్టర్లకు సంబంధించిన చెరువులను పున: పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది. రీ ఎంక్వరీకి ఏడీని కాకుండా మరో అధికారిని పంపాలని సూచించినట్లు సమాచారం.

చేపల చెరువుల పరిశీలనపై అనుమానాలు..

ఈ ఏడాది జిల్లాలోని 976 చెరువులను ఎంపిక చేసిన మత్స్యశాఖ అధికారులు 4.54 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా నిర్దేశించుకుని టెండర్లను ఆహ్వానించారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధా నం ద్వారా టెండర్లు జరుగగా, ముగ్గురు బిడ్‌లు వే శారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరు, కరీంనగర్‌కు చెందిన ఒకరు ఉన్నారు. వీరు చూపిన చేప పిల్లల పెంపకం కేంద్రాలను పరిశీలించడానికి కమిటీ వే యగా, ఇందులో మత్స్యశాఖ ఏడీ, పశుసంవర్ధక శా ఖ అధికారి, రెవెన్యూ అధికారి, చీఫ్‌ ప్రమోటర్‌ ఉ న్నారు. చీఫ్‌ ప్రమోటర్‌ను పక్కన పెట్టి నిబంధనలు పాటించకుండా దగ్గర సంబంధాలున్న అధికారుల ను వెంట తీసుకెళ్లినట్లుగా ఏడీపై ఆరోపణలు న్నా యి. పరిశీలన చేసి నివేదిక తయారు చేసిన అధికారులు ఏపీకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లను టెండర్ల నుంచి రద్దు చేయడంతోనే ఈ వివాదం మొదలైంద ని ప్రచారం జరుగుతోంది. సక్రమంగా ఉన్న చేపల చెరువుల్లో లేని లోపాలు చూపారని, వేరే కాంట్రాక్టర్‌కు బినామీగా ఉండి చేప పిల్లల పంపిణీ కాంట్రాక్ట్‌ను పొందే ప్రయత్నం చేసినట్లుగా బాధిత కాంట్రాక్టర్లు ఏడీపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఏడీ ఆంజనేయస్వామిని వివరణ కోరేందుకు ప్రయ త్నించగా స్పందించలేదు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ను సంప్రదించగా టెండర్లు వాయిదా పడ్డా యని, రీ ఎంక్వయిరీ చేయించనున్నట్లు తెలిపారు.

అనుకూలంగా ఉన్నవారికి

కట్టబెడుతున్నారని ఏడీపై ఆరోపణలు

కలెక్టర్‌, అదనపు కలెక్టర్లకు

కాంట్రాక్టర్ల ఫిర్యాదు

వాయిదా పడిన టెండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement