
ప్రజావాణికి 40 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి 40 ఫిర్యాదు లు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డిలకు విన్నవించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ఎస్సైకి సన్మానం
కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తూ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న ఎస్సై ఎండీ నసీరుద్దీన్‌ను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూల మాలలు, శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. నసీరుద్దీన్ అందించిన సేవలను కొనియాడారు.