
ప్రజల కోసమే పోరాటాలు చేస్తాం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే
కూనంనేని సాంబశివరావు
● నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ
నిజామాబాద్ సిటీ: కమ్యూనిష్టు పార్టీలెప్పుడూ ప్రజల కో సమే పోరాటాలు చేస్తాయని, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎర్రజెండా రెపరెపలాడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైనా రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తూనే ఉంటామన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ కమిటీలో శనివారం ఏఐటీయూసీ 2వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. స్వార్థంలేని సిద్ధాంతాలున్న పార్టీ సీపీఐ అని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మార్కెట్‌యార్డును పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్‌యార్డుకు పునర్‌జీవం వచ్చిందన్నారు. ఇళ్లులేని కార్మికుల కు డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇచ్చే ఏర్పాటుచేస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌యార్డులోని సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. రైతులకు, కార్మికుల కోసం ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. ఏఐటీయూసీ నాయకుడు ఓమ య్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా కార్మికులకు తిప్ప లు తప్పడం లేదన్నారు. పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్క రించేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. నాయకులు బాల్‌రాజ్, నర్సింహా, ప్రవీణ్, కంకర భూమయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసమే పోరాటాలు చేస్తాం