
ఆర్వోబీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
● రోడ్డుపై గుంతలో కూరుకుపోయిన బస్సు
● అరగంటపాటు నిలిచిన ట్రాఫిక్
నిజామాబాద్ రూరల్/డిచ్‌పల్లి: నగర శివారులోని మాధవనగర్ ఆర్వోబీ వద్ద శనివారం భారీగా ట్రా ఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్వోబీ రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతోపాటు ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు రోడ్లపై వర్షపునీరు నిలిచి, గుంతలు కనిపించడం లేదు. కొందరు వాహనదారులు గుంతలను గమనించక వెళుతుండటంతో కొన్ని వాహ నాలు దిగబడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు దిగబడిపోవడంతో బైపాస్ నుంచి డిచ్‌పల్లి వైపు, డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వైపు వచ్చే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. అరగంట పాటు వాహనాలు ఎటూ కదలక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డిచ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను క్రమబద్దీకరించారు. నగరంలోని సారంగాపూర్ రహదారిపై సైతం గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఆర్వోబీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్