బీసీ మహిళకే జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

బీసీ మహిళకే జెడ్పీ పీఠం

Sep 28 2025 6:58 AM | Updated on Sep 28 2025 6:58 AM

బీసీ

బీసీ మహిళకే జెడ్పీ పీఠం

జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల వివరాలు

ప్రకటించిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు సైతం

ఎన్నికల నోటిఫికేషన్‌ రావడమే

తరువాయి..

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జెడ్పీ చైర్‌పర్సన్‌, జె డ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించి రిజర్వేష న్లు ఖరారు అయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శని వారం గెజిట్‌ విడుదల చేసింది. మరోవైపు కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజ ర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 మండలాలకు ఖరారైన రిజర్వేషన్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరా రు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డిప్యూటీ సీఈవో సాయ న్నలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్‌ చేస్తూ, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్‌ కమిషన్‌ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల కేటాయించినట్లు వివరించారు.

● జిల్లాలోని మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి మహిళలకు కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపా రు. ఎస్సీలకు ఐదు జెడ్పీటీసీ స్థానాలు రిజర్వు కా గా, మహిళలకు రెండు స్థానాలు కేటాయించారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఆ రు స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగిలిన 10 మండలాలు జనరల్‌ కేటగిరిలో ఉండగా, ఇందులో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు.

● జిల్లాలోని 31 ఎంపీపీ స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వు అయ్యాయని, ఇందులో ఒకటి మహిళలకు రిజర్వు చేసినట్లు కలెక్టర్‌ తెలి పారు. ఎస్సీలకు ఐదు ఎంపీపీ స్థానాలు రిజర్వు కాగా, ఇందులో మహిళలకు రెండు స్థానాలు కేటా యించారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఆరు స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగిలిన 10 మండలాలు జనరల్‌ కేటగిరిలో ఉండగా, ఇందులో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

● ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు రిజర్వేషన్లు ప్రకటించారు.

● అయితే బీసీ బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉ న్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఎలా కేటాయింపులు చే స్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో నోటిఫికేషన్‌ విషయమై ఉత్కంఠ నెలకొంది.

రిజర్వేషన్లు ఖరారు

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు దక్కనుంది. ఇందుకు సంబంధించి రిజర్వేషన్‌ ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్‌ జారీ చేసింది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతోపాటు ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

బీసీ మహిళకే జెడ్పీ పీఠం1
1/2

బీసీ మహిళకే జెడ్పీ పీఠం

బీసీ మహిళకే జెడ్పీ పీఠం2
2/2

బీసీ మహిళకే జెడ్పీ పీఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement