
విశ్వ వేదికలపై ఆర్మూర్ ‘గజ్జె’
ఆర్మూర్ పట్టణంలోని నటరాజ నృత్యనికేతన్‌లో కూచిపూడి శిక్షణ పొందిన చిన్నారులు దేశ విదేశాల్లో తమ నాట్య ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా స్పాన్సర్షిప్ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. పట్టణానికి చెందిన మాడవేటి నారాయణ స్థాపించిన నటరాజ నృత్యనికేతన్‌లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళిని శి ష్యరికంగా చిన్నారులు కూచిపూడి, జానపద నృత్య రీ తులు, పేరిణి నాట్యాన్ని అభ్యసిస్తూ నాట్య మయూరాలుగా పేరొందారు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నాట్య గురువు శ్రమ తోడవడంతో వీరి ప్రతిభను చాటి చెప్పడానికి స్పాన్సర్స్ సైతం స్వచ్ఛందంగా ముందుకు రావడం ప్రత్యేకత సంతరించుకుంది. గత జూన్ 8న దుబాయిలో యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్‌అండ్‌కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నృత్యనికేతన్‌కు చెందిన 8 మంది చిన్నారులు ఆంధ్రనాట్యం, కూచిపూడి ప్రదర్శననిచ్చారు. తాజాగా ఈ నెల 28, 29వ తేదీల్లో మలేషియాలో యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్‌అండ్‌కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై తమ శిశ్యులతోపాటు వచ్చి ప్రదర్శననివ్వాల్సిందిగా నాట్య గురువు డాక్టర్ మృణాళినితోపాటు 12 మంది చిన్నారులకు నిర్వాహకులు దేవులపల్లి పవన్ ఆహ్వానం పంపించారు. దీంతో సాయి శృతి, వైష్ణవి, హయాతి, సాన్నిధ్య, ప్రియాన్షి, పావని, శ్రీనిధి, శ్రీవల్ల్లి, నిశ్రుత, అనన్య, శ్రీలేఖ, నివృతి మలేషియాకు పయనమయ్యారు.

విశ్వ వేదికలపై ఆర్మూర్ ‘గజ్జె’