
కోతకు ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): వరి పంట కోతకు ముందుగానే సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా సహకార అధికారి (డీసీవో) శ్రీనివాస్ సూచించారు. సహకార, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కోసం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శనివారం డిచ్‌పల్లి పీఏసీఎస్‌లో నిజామాబాద్ డివిజన్ స్థాయి స న్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొ నుగోలు చేసిన వెంటనే సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ, మానిటరింగ్ ఆఫీసర్లు మయూరి, లావణ్య, మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలు, సహకార సంఘాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.