
వేగంగా పంటల నమోదు
● ఇప్పటి వరకు 3.55 లక్షల ఎకరాలు ఆన్‌లైన్‌లో ఎంట్రీ
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పలు చోట్ల పంట కోతలు మొదలవగా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యే నా టికి డిజిటల్ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వ్యవసాయాధికారులు వేగంగా పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 5.25 లక్షల ఎక రాలకు పైగా వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 4.36 లక్షల ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం మొక్క జొన్న, సోయా, పప్పుదినుసుల పంట కోతలు మొదలయ్యాయి. డీసీఎస్ పోర్టల్‌లో ఎంట్రీ చేస్తున్న డేటా ప్రకారమే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.55 లక్షల ఎకరాల పంటల వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. అక్టోబర్ 20 నాటికి డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలని గడువు విధించింది.
మున్సిపల్ టూ మహిళా శిశుసంక్షేమ శాఖ ఈవో
బోధన్‌టౌన్(బోధన్): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ప్రకటించిన మహిళా శిశు సంక్షేమ శాఖ విస్తరణ అధికారి పరీక్ష ఫలితాల్లో బోధన్‌కు చెందిన ఆర్. మౌనిక ఎంపికై ంది. ఆమె గ్రూప్–4లో ఉత్తీర్ణత సాధించి బోధన్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంది. తండ్రి అప్పల నాయుడు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. తల్లి కమల కుమారి ఆధ్యాత్మిక శిక్షకురాలిగా ఉన్నారు.

వేగంగా పంటల నమోదు