
ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
● నిజామాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్
దాదన్నగారి విఠల్‌రావు
● జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు డిమాండ్ చేశారు. నగరంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఐలమ్మ 131వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విఠల్‌రావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని గతంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. అనంతరం రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. నాయకులు రమణరావు, బి.శ్రీనివాస్‌రావు, నీలంరెడ్డి, అగ్గు సంతోష్, మాకు రవి, న్యాలం రమేష్, బి.చలపతిరావు, షేక్ సాదిక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.