
తులం బంగారం ఇచ్చే వరకు కొట్లాడుతా..!
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి
చెక్కుల పంపిణీ
బాల్కొండ: సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీమేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులతోపాటు తులం బంగారం ఇచ్చేవరకు కొట్లాడుతానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చాడన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదన్నారు. తులం బంగారం ఇవ్వాలని అడిగితే తనపై, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. ఎన్ని దాడులు చేసిన భయపడేది లేదన్నారు.
భారీ బందోబస్తు..
భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్యే ఒక్కరే చెక్కులను పంపిణీ చేయాలని తెలపడంతో ఎమ్మెల్యేనే పంపిణీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు లోపలికి అనుమతివ్వలేదు. కేవలం లబ్ధిదారులను మాత్రమే లోపలి పంపించారు. మీడీయాకు కూడ అనుమతివ్వలేదు.

తులం బంగారం ఇచ్చే వరకు కొట్లాడుతా..!