
కలవారి కోడలు ఉయ్యాలో..
డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మండపంలో రూ.21,11,111 నగదు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.
శ్రీ మహాలక్ష్మీ.. నమోస్తుతే
జిల్లాలో దుర్గామాత నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనలు నిర్వహించారు. పలు మండపాల్లో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు.

కలవారి కోడలు ఉయ్యాలో..