
24/7 నిఘా.. పెట్రోలింగ్
ప్రశ్న: పండుగ సెలవుల్లో..
– నరేశ్, సంజీవ్‌రెడ్డి నగర్, ఆర్యనగర్, నిజామాబాద్
ఏసీపీ: పండుగ సెలవుల్లో ఇళ్లు వదిలి గ్రామాలకు వెళ్లేవారు ముందుగా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమా చారం అందించాలి. దీంతో పెట్రోలింగ్ బృందాలు ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతాయి. పక్కింటి వారి తో మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే సమాచారం అందించాలని చెప్పాలి.
● డబ్బు, బంగారం భద్రతకు..
– వేముల సునీల్, చంద్రానగర్, నిజామాబాద్
● ఊరికి వెళ్లితే ఇంట్లో బంగారం, డబ్బు ఉంచకుండా తమ వెంట తీసుకుపోవాలి. లేదంటే బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవడం ఉత్తమం. బీరువా తాళాలు ఇంట్లో ఉంచొద్దు. ఊరికి వెళుతున్నట్లు వాట్సాప్ స్టేటస్‌తోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. ఊరెళ్లినప్పుడు ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారని గ్రహించి దుండగులు చోరీకి సాహసించే అవకాశం ఉండదు.
● నగరం, గ్రామాల్లో పెట్రోలింగ్..
– గాండ్లపల్లి, నర్సారెడ్డి, ఆర్మూర్
● పండుగలకు పెట్రోలింగ్‌ను ఎక్కువగా చేస్తాం. అదనపు బృందాలను ఏర్పాటు చేసి కాలనీలు, గ్రా మాల్లో పెట్రోలింగ్ చేసేలా చూస్తున్నాం. ఇప్పటికే కాలనీ పోలీసులు, గ్రామ పోలీసులు అందుబాటు లో ఉన్నారు. సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశాల మేరకు శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బ్లూకోల్ట్ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
● అత్యవసర సమయాల్లో..
– శ్రీకాంత్, చంద్రశేఖర్‌కాలనీ, నిజామాబాద్
● దొంగతనాలు జరిగినప్పుడు, ఇతర సమస్యలు తలెత్తితే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు లేదా ‘డయల్ 100’కు కాల్ చేయాలి.
● సీసీ కెమెరాల ఏర్పాటు..
– సాగర్, ఖుద్వాన్‌పూర్, నందిపేట్
● ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. దీంతో దొంగలు దొరికిపోతామని భావించి చోరీకి ప్రయత్నించరు. కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రా వాలి. రోడ్డు, ఇళ్లు కనిపించేలా సీసీ కెమెరాలను బి గించుకోవాలి. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అలారంను అమర్చుకుంటే పీఎస్‌తోపాటు యజమానిని ముందుగానే అప్రమత్తం చేస్తుంది.
రాత్రివేళ ప్రయాణం..
– ప్రసాద్, గాయత్రినగర్, నిజామాబాద్
రాత్రివేళ ప్రయాణం చేయడం తగ్గించుకోవాలి. గమ్యం చేరుకోవడానికి కాస్త ముందుగానే బయల్దేరాలి. డ్రైవింగ్ చేస్తుండగా నిద్రమత్తు వస్తే.. అప్రమత్తమై రోడ్డు పక్కన వాహనం నిలిపి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీతోపాటు వెంట వచ్చేవారు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ భారీ వాహనాలు వెళుతుంటాయి. అందులో స్పీడ్‌గా వెళ్లే వాహనాలుంటాయి. బ్లాక్‌స్పాట్‌ల వద్ద వాహనాదారులు మెల్లిగా వెళ్లాలి. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దు.
పండుగ పూట అప్రమత్తంగా ఉండాలి
ఊరెళ్తే పోలీసులకు సమాచారమివ్వండి
శివారు ప్రాంతాల భద్రతపై స్పెషల్ ఫోకస్
ఆపదలో ఉంటే పోలీసులు లేదా డయల్ 100 కు కాల్ చేయండి
‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో నిజామాబాద్
ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి