
యువ వికాసమేదీ..?
మెండోరా మండల కేంద్రానికి చెందిన యమున రాజీవ్ యువ వికాసం పథకం కింద
రూ.2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణ దుకాణం, లేడిస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. అయితే ఇప్పటి వరకు యువ వికాసం రుణం మంజూరు కాలేదు. స్వయం ఉపాధి పొందడానికి తనకు రాయితీ రుణం ఒక్కటే మార్గమని భావించే యమున వంటి వారెందరో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మోర్తాడ్(బాల్కొండ) : రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభు త్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయి తీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. జూ న్ 2కు ముందే దరఖాస్తులను స్వీకరించగా, జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. వాయిదా పడిన పథకం అమలుకు ఇప్పటి వరకు షెడ్యూల్‌ను ఖరారు చేయలేదు. కనీసం ఎప్పుడు రుణాలు అందిస్తారో ప్రభుత్వం వెల్లడించకపోవడం విచారకరం. రాజీవ్‌యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిబిల్ రికార్డు బాగుండాలని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం రాయితీ కోసం నిధులను కేటాయించకపోవడంతో రుణాల పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 58వేల దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో 58వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్‌ల ద్వారా రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజికవర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటన
మూడు నెలలు గడుస్తున్నా
జాడలేని నిధులు
స్వయం ఉపాధి కోసం యువతకు
తప్పని నిరీక్షణ