
దరఖాస్తుకు రూ.3 లక్షలు
● వైన్ షాపులకు అప్లికేషన్ల
స్వీకరణ ప్రారంభం
● జిల్లాలో 102 మద్యం షాపులు
ఖలీల్‌వాడి: జిల్లాలోని 102 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–27 నూతన మద్యం పాలసీ ద్వారా జిల్లాలోని 102 వైన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని, ఒక్కో దరఖాస్తు ధర రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్నవారి రూ.3 లక్షలు నాన్ రీఫండబుల్‌గా నిర్ణయించామని తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్ పరిధిలో 36, ఆర్మూర్ 25, బోధన్ 18, భీంగల్ 12, మోర్తాడ్‌లో 11 మద్యం షాపులు ఉన్నాయన్నారు. గురువారం కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో గౌడ సామాజిక వర్గానికి 11, ఎస్టీలకు 2, ఎస్సీలకు 11 వైన్ షాపులు కేటాయించినట్లు తెలిపారు. నందిపేట్‌లో మద్యం షాపును తగ్గించి నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామంలోని వైన్ షాపును తొలగించి మండల కేంద్రంలో, నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ వైన్ షాపును ముబారక్‌నగర్‌లో, బాల్కొండ లోని వైన్‌షాపును మోపాల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను ఈఎస్ కార్యాలయంలో అందించాలని, 23న నగర శివారులోని భారతీ గార్డెన్‌లో డ్రా తీస్తా మని తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ స్వప్న, గుండప్ప, మల్లేశ్, భాస్కర్ రావు, పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ(గౌడ)లకు కేటాయించిన వైన్ షాపులు (నంబర్లు)
ఎస్టీ: అంకాపూర్, బషీరాబాద్(1)
ఎస్సీ: ఖానాపూర్(3), నాందేవ్‌వాడ(2), ఆర్‌ఆర్ చౌరస్తా(3), మోపాల్(2), బోధన్ (5),
కోటగిరి, ఆర్మూర్(5), బాల్కొండ(1), దూద్‌గాం, ధర్‌పల్లి(1, 3)
బీసీ (గౌడ్స్): మోపాల్(1), సాటాపూర్(1), ఆర్మూర్(6), జక్రాన్‌పల్లి(1), రెంజల్, భీమ్‌గల్– 1,3,4, మోర్తాడ్(1), కమ్మర్‌పల్లి(1), బషీరాబాద్(2)
దరఖాస్తుకు కావాల్సినవి..
రూ. 3 లక్షల (నాన్ రిఫండబుల్)
డీడీ/చలాన్
ఆధార్/పాన్ కార్డు
మూడు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ(గౌడ కులస్తులు)
కుల ధ్రువీకరణ పత్రం