
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం వినాయక్‌నగర్‌లోని విగ్ర హానికి అదనపు కలెక్టర్, అధికారులు, కుల సంఘా ల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యూ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసి స్ఫూర్తిని నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, సహాయ అధికారి గంగాధర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.