
ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా..
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపల్లి గాయత్రి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహి స్తోంది. ఓ వైపు జాబ్ చేస్తూనే గ్రూప్–1కు పట్టుదలతో సన్నద్ధమైంది. ఆమె పట్టుదలకు విజయం వరించింది. గ్రూప్–1కు ఎంపికై ంది. మల్జీజోన్–1లో 201వ ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. రెండు రోజుల క్రితం టీజీపీఎస్‌సీ గ్రూప్–1 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగానికి ఎంపికై న గాయత్రి మాటల్లోనే...
మా నాన్న సీతారాములు ఆర్టీసీ కండక్టర్, అమ్మ రాజమణి ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు రామారెడ్డిలో, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్‌సీ జిల్లా కేంద్రంలో చదివాను. ఉస్మానియాలో ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ పూర్తి చేశాను. 2020లో గ్రూప్–4కి ఎంపికై కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాను. డబుల్ పీజీ చదివి జూనియర్ అసిస్టెంట్‌గా ఎందుకమ్మా గ్రూప్–1 ప్రయత్నించి అధికారి కావొచ్చ ని తోటి ఉద్యోగులు చెప్పడంతో నేను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించాను. సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లో నెగ్గాను. ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది.