
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
నిజామాబాద్‌అర్బన్/ మోర్తాడ్(బాల్కొండ): గ్రూప్–1 ఫలితాల్లో భీమ్‌గల్ మండలం చేంగల్ వాసికి ఉద్యోగం లభించింది. నంబి శ్రీనివాస్, శ్రావణి దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి కుమారుడు నంబి ఆత్రేయబాబు గ్రూప్–1 ఫలితాల్లో 461.5 మార్కులు సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆత్రేయబాబు ప్రస్తుతం చైన్నెలోని ఎయిర్‌పోర్టు రీజినల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఎయిర్‌పోర్టు ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. అనంతరం తండ్రి సూచన మేరకు గ్రూప్–1ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యారు.
మొదటిసారిగా పరీక్ష రాయగా మెరుగైన మార్కులతో ఎంపీడీవో పోస్టుకు ఎంపికయ్యారు. ‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాను. గ్రూప్–1 ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.’ అని ఆత్రేయ బాబు తెలిపారు.