
పశువుల షెడ్లు శుభ్రంగా ఉంచాలి
● జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: వర్షాకాలం దృష్ట్యా పాడి రైతులు పశువుల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జలాల్‌పూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పశువులు పెంచుకునే స్థలాన్ని ఎప్పటికప్పడు శుభ్రపరుచుకోవాలన్నారు. పశువులకు పౌష్టికాహారాన్ని అందిస్తే అవి ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. గ్రామంలో మొత్తం 57 పశువులకు చికిత్స చేసి, పాడి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబూరావు, నరేందర్, వీఎల్‌వో రమేశ్, భాస్కర్, శ్రీనివాస్, నరేశ్, అస్రఫ్, గంగారాం, మాజీ సర్పంచ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.