
ఘనంగా వాల్మీకి జయంతి
నిర్మల్‌చైన్‌గేట్: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. వేడుకల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధి కారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, మత్స్యశాఖ ఏడీ రాజానర్సయ్య, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్, ఎల్డీఎం.రామ్‌గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ జానకీ షర్మిల వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు

ఘనంగా వాల్మీకి జయంతి