
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుమురంభీం
నిర్మల్‌టౌన్: ఆదివాసీల ఆత్మగౌర ప్రతీక కుమురంభీం అని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. మంగళవారం కుమురంభీం 85వ వర్ధంతి సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా కమిటీ నాయకులు జిల్లా కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ.. జల్.. జంగల్.. జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా కుమురంభీం పోరాడారని తెలిపారు. ఆదివాసీల హక్కులు, అణగారిన వర్గాల స్వయంపాలన, స్వాభిమానం కోసం పోరాడని యోధుడు అని కొనియాడారు. నిర్మల్‌లో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొడసం గోవర్ధన్, ఆదివాసీ నాయకులు మల్లేశ్, సాయన్న, రాజేశ్వర్, నారాయణ, సాయినాథ్, అత్రం రాజు, తొడసం శంభు పాల్గొన్నారు.