
వ్యక్తిత్వ నిర్మాణంతో సమగ్రత
నిర్మల్‌ఖిల్లా: వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరిగి సమగ్రత సిద్ధిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్య నగర్ బస్తీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్.రెడ్డి కాలనీ క్లబ్ హౌస్‌లో ఆదివారం విజయదశమి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ పొద్దుటూరి గంగారెడ్డి, నిర్మల్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, స్వయం సేవకులు, దివ్యనగర్ బస్తీ వాసుల పాల్గొన్నారు.
హిందువుల ఐక్యతకే పంచపరివర్తన్
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని జిల్లా ధర్మజాగారణ టోలి సభ్యులు బ్రహ్మబట్ రాజేశ్‌సింగ్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వివేక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో విజయదశమి నిర్వహించారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాత న జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో చింతపండు రవి, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మల్లికార్జున్ రెడ్డి, కూనప్రవీణ్, రఘునందన్‌రెడ్డి, ధీరజ్, సైండ్ల శ్రీధర్, గోవర్ధన్, నరేశ్, శంకర్, టీఎన్.స్వామి పాల్గొన్నారు.