
మాజీ మంత్రి తులాభారం
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఎదుట ఉన్న తులాభారం వద్ద అభిమానులు ఆయన బరువుకు సరిపడా బెల్లంతో తులాభారం వేయించి భక్తులకు, ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాధవరావు, నాయకులు రాజేశ్వర్‌రావు, సుచరిత, అడెల్లి తదితరులు పాల్గొన్నారు.