
పాఠశాల పునర్నిర్మాణంలో పూర్వవిద్యార్థులు
నిర్మల్: తమకు విద్యాబుద్ధులు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పిన సరస్వతీ శిశుమందిరానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లాకేంద్రంలోని బాగులవాడ శిశుమందిర్‌లో చదివిన పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. స్థానిక పాఠశాల ప్రాంగణంలో గురువారం ఉదయం బడి భవన పునర్నిర్మాణానికి సామూహికంగా భూమిపూజ నిర్వహించారు. సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, విద్యాభారతి దక్షిణమధ్య ప్రశిక్షణా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నార్లాపురం రవీందర్, పూర్వవిద్యార్థి పరిషత్ బాధ్యులు సాత్పుతే శ్రీనివాస్, అయ్యన్నగారి శ్రీకాంత్, శశిరాజ్, అంగ జగదీశ్, కిశోర్, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.