
సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కోమరాజు కరుణాకర్(27) అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. రాజస్తాన్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 6న పగిడిపల్లి–భువనగిరి రైలు మార్గంలో రైలు కింద పడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బుధవారం నిర్వహించిన కరుణాకర్ అంత్యక్రియలకు సైనికాధికారులు హాజరై గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జాతీయపతాకాన్ని కరుణాకర్ తల్లి లక్ష్మికి అందజేశారు. కరుణాకర్ తండ్రి వెంకటేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తూ 28ఏళ్ల క్రితమే మృతిచెందాడు. అనంతరం కరుణాకర్ తల్లి లక్ష్మి స్వీపర్‌గా పనిచేస్తూ ఏకై క కుమారుడిని కష్టపడి చదివించింది. కరుణాకర్‌కు కొంతకాలం క్రితం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామానికి చెందిన లతతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు