
చేనేత రుణమాఫీ ఏమాయే..!
రూ.75 వేలు బకాయి ఉంది
తక్షణమే రుణమాఫీ చేయాలి
ఆదేశాలు రాలేదు..
భూదాన్‌పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 13 నెలలవుతున్నా నేటికీ అమలుకు నోచుకోకవడ్డీ భారం పెరుగుతుందని నేతన్నలు వాపోతున్నారు.
రుణమాఫీకి జీఓ జారీ చేసినా..
రుణమాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఎన్‌ఐహెచ్‌టీ) ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేయడం, ఎన్నికల కోడ్ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఏడు నెలల క్రితం అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష లోపు ఉన్న వ్యక్తిగత చేనేత రుణాలను మాఫీ చేస్తూ జీఓ నంబర్ 56ను జారీ చేసింది. 2025–26 బడ్జెట్ నుంచి రూ.33 కోట్లు మంజూరు చేస్తూ నాలుగు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్కుల కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు చెల్లించేందుకు అధికారాలు ఇచ్చారు.
నేటికీ ఆమోదించని రాష్ట్ర కమిటీ
రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించకపోవడంతో రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో చేనేత కార్మికులు తీసుకున్న రుణాల వివరాలను చేనేత, జౌళి శాఖ ఏడీలు బ్యాంకుల వారీగా జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్న డీసీసీబీ సీఈఓ, చేనేత శాఖ ఆర్‌డీడీ, లీడ్‌బ్యాంకు మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారులు ఆమోదించారు. అనంతరం ఆగస్టులో రుణమాఫీ అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించారు. కొన్ని జిల్లాల నుంచి జాబితాలు రాష్ట్రస్థాయి కమిటీకి అందని కారణంగా రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతోందని తెలిసింది.
అప్పు చేసి చెల్లించి..
రూ.లక్ష పైన రుణాలు తీసుకున్న వారు ఆ పై మొత్తాన్ని జూలై నెలాఖరులోగా చెల్లిస్తే వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పడంతో చాలా మంది అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి రుణాలు చెల్లించారు. రుణమాఫీ అమలు కాక కార్మికుల ఖాతాల్లోంచి మూడు నెలల వడ్డీ కట్ చేసుకున్నారు. మరోవైపు బయట తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఫ రూ.లక్ష లోపు రుణాలు
మాఫీ చేస్తామని 13 నెలల క్రితం
ప్రకటించిన ప్రభుత్వం
ఫ నాలుగు నెలల కిత్రం జీఓ జారీ
ఫ నేటికీ అమలుకు నోచుకోని పథకం
ఫ ఇబ్బందుల్లో చేనేత కార్మికులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. యాదాద్రి జిల్లాలో వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికులకు రూ.19.25 కోట్ల రుణమాఫీ జరుగనుంది. అలాగే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 423 మంది చేనేత కార్మికులకు రూ.4కోట్ల రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,803 మందికి రూ.23.25 కోట్ల మేర రుణమాఫీ కానుంది.
2015లో స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.50 వేలు లోన్ తీసుకున్నాను. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తం రూ.75వేలు బకాయి ఉంది. ఇంకా చేనేత రుణమాఫీ కాలేదు. వెంటనే నేత కార్మికులకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. – మిర్యాల వెంకటేశం,
చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి ఏడాది గడిచిపోయింది. తక్షణమే చేనేత రుణమాఫీ చేయాలి. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా, చేనేతపై జీరో జీఎస్టీ తదితర సమస్యలపై చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పోచంపల్లిలో అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం.
– కర్నాటి పురుషోత్తం, చేనేత జన సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు
చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికుల జాబితాను ఆగస్టులోనే రాష్ట్రస్థాయి కమిటీకి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. – శ్రీనివాసరావు,
యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ
ఈ ఫొటోలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు
గుండు ప్రవీణ్. రెండేళ్ల క్రితం స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణం తీసుకున్నాడు. నెలానెలా కిస్తీలు చెల్లిస్తూ వస్తుండగా.. చివరగా రూ.1.23లక్షలు బకాయి పడ్డాడు. రూ.లక్ష లోపు చేనేత రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బంగారం అమ్మి పై రూ.23,500 బ్యాంకులో చెల్లించాడు. కానీ ఇప్పటివరకు మిగతా రూ.లక్ష, రుణమాఫీ కాలేదు. దీంతో మూడు నెలల వడ్డీ కింద అతని ఖాతా నుంచి రూ.3వేలు కట్ చేశారు.

చేనేత రుణమాఫీ ఏమాయే..!

చేనేత రుణమాఫీ ఏమాయే..!

చేనేత రుణమాఫీ ఏమాయే..!

చేనేత రుణమాఫీ ఏమాయే..!