త్రిపురారం : మండల కేంద్రంలోని రాజీవ్ కాలనీలో ఎస్టీ మినీ గురుకులాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భారతీ విద్యార్థులు హస్టల్‌లో నేల పైన నిద్రించాల్సి వస్తోందని కలెక్టర్‌కు వివరించారు. హాస్టల్ మొత్తం కలియదిరిగిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చిటించారు. విద్యార్థుల సౌకర్యార్థం 100 పరుపులను అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఉదయం ఇచ్చిన హామీ ప్రకారం సాయంత్రానికి పాఠశాలకు 100 పరుపులు పంపించారు. దీంతో మండల అధికారులు కలెక్టర్ పంపించిన 100 పరుపులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంఈఓ రమావత్ రవినాయక్, హెచ్‌ఎం భారతీ, సిబ్బంది ఉన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
జ్వరాలు ప్రబలుతున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె ఆస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది సమయ పాలన పటించాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల వైద్యాధికారి మాళోతు సంజయ్ ఉన్నారు.
ఫ విద్యార్థులకు 100 పరుపులు పంపిణీ