నల్లగొండ అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ పరికరాలపై జీఎస్‌టీ తగ్గించడంతో రైతులకు ఊరట లభించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలపై గతంలో 18 శాతం జీఎస్‌టీ ఉండేది. దీంతో రైతులపై పెద్ద ఎత్తున భారం పడేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడంతో వ్యవసాయ పరికరాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం రైతులకు కాస్త మేలు జరగనుంది.
ఇప్పటి వరకు 1400 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనుంది. గత యాసంగిలోనే పథకాన్ని ప్రారంభించినప్పటికీ మార్చిలో బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల నిధులు రాలేదు. ఈసారి ముందస్తుగానే ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పరికరాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1400 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అక్టోబరు చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాలను అందించనున్నారు.
సబ్సిడీపై పరికరాల అందజేత
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించడంతో.. ప్రభుత్వానికి వ్యవయాయ యాంత్రీకరణ పరికరాలు సరఫరా చేసే కంపెనీలు కూడా రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేయనున్నారు. యాంత్రీకరణ దరఖాస్తులను స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు.. యూనిట్ల రేట్లను సవరిస్తున్నారు. దీంతో ఈ పథకంలో రైతులపై కూడా ఆర్థికభారం తగ్గనుంది.
15 రకాల పరికరాలు..
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 15 రకాల పరికరాలు ఉన్నాయి. వాటిలో రోటోవేటర్, ఎండీ ప్లగ్, కల్టివేటర్, డిస్క్‌యారో, కేజీవీల్, పండ్ పర్మార్, రోడో పడ్లర్, పవర్ టిల్లర్, సీడ్ ఫ్రం పర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్పేయర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రే, పవర్ వీడర్, బ్రష్‌కటర్, స్ట్రాబేలర్స్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై అందించనున్నారు. జీఎస్‌టీ సవరించడంతో వీటి ధరలు కూడా తగ్గనున్నాయి.
ఫ జీఎస్‌టీ తగ్గింపుతో దిగివస్తున్న
వ్యవసాయ పరికరాల రేట్లు
ఫ యాంత్రీకరణ పథకానికి రేట్లు
సవరిస్తున్న అధికారులు
ఫ 15వ తేదీ వరకు
దరఖాస్తులకు అవకాశం
ఫ ఈ నెలాఖరు నాటికి రైతులకు
అందనున్న పరికరాలు
రైతులకు ఊరట
రైతులకు ఊరట
రైతులకు ఊరట
రైతులకు ఊరట