
బీమా ఉద్యోగుల పోరాట ఫలితమే జీఎస్టీ రద్దు
నల్లగొండ టౌన్: బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగులు సంఘం పోరాట ఫలితమే అని సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.రఘు అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన ఐసీఈయూ నల్లగొండ 1,2, ఎల్‌ఐసీ శాఖల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు ఎన్నో ఆందోళనలు చేశామన్నారు. ఎల్‌ఐసీలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఐసీఈయూ డివిజన్ కోశాధికారి జావీద్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ళ బాలస్వామి, గడ్డం నవీన్‌దాస్, బి.రాములుయాదవ్, బెల్లంకొండ కన్నయ్య, వెంకన్న, పోలె లింగయ్య, వేముల కృష్ణయ్య, వేముల శ్రీను, గౌరు శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరెడ్డి, శ్యాంబాబు, నరేందర్‌రెడ్డి, రావుల వీరయ్య, నలపరాజు సైదులు, దారం వెంకన్న, బి.రామలింగం పాల్గొన్నారు.