
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతల స్వీకరణ
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ (2025–27) నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి–1 (ప్రధాన కార్యదర్శి)గా వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడిగా గోళ్ల రామ్‌శేఖర్, కార్యదర్శి–2గా పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారిగా గందె రాముతోపాటు పది మంది డైరెక్టర్లు గౌరు శంకర్, నీలా పాపారావు, రాయిని శ్రీనివాస్, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవరెడ్డి, కొమ్మన పట్టాభిరామ్, గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని రైస్ మిల్లర్స్, బంధువులు, స్నేహితులు, శాలువాలలు, పూమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మిల్లర్స్ మాజీ ఉపాధ్యక్షుడు గంట సంతోష్‌రెడ్డి, డాక్టర్ బండారు కుశలయ్య, రంజిత్, కర్నాటి లక్ష్మీనారాయణ, రంగా శ్రీధర్, రేపాల అంతయ్య, మాశెట్టి శ్రీనివాస్, రవికుమార్, రమేష్, నాగరాజు పాల్గొన్నారు.