
పురాతన మానవులు గీసిన చిత్రాలు లభ్యం
దేవరకద్ర: మండలంలోని బస్వాయపల్లి శివారు చిన్నరాతిగుట్టపై పడిగెరాతి కింద గుండుపై పురాతన మానవులు గీసిన రాతి చిత్రాలు శుక్రవారం వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో జరిపిన అన్వేషణలో ఈ చిత్రాలు కనిపించాయని పరిశోధకుడు కావలి చంద్రకాంత్ తెలిపారు. రెండు జంతువులు పొడగాటి దేహలు, పెద్ద తోకలు, ఒంటిమీద చారలతో కనిపిస్తున్నాయని.. ఈ త్రాలు పెద్ద పులులవని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ వివరించారు. రాతి గుట్ట 12 అడుగుల ఎత్తులో ఉందని.. చిన్న గుహలా ఉందని, ఒకప్పటి పురాతన మానవుడి ఆవాసంగా ఉండవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాతి చిత్రాల తావులను పరీక్షించి భద్రపర్చాల్సినన అవసం ఉందని చెప్పారు.
విద్యతోనే సమాజ అభివృద్ధి
కందనూలు: విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ డీజీపీ పుట్టపాక రవీంద్రనాథ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో దసరా సంతోష కూట ఉత్సవాలు నిర్వహించారు. స్వర్గీయ మహేంద్రనాథ్ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు విద్యార్థుల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. మహేంద్రనాథ్ ఆశయాలను భవిష్యత్‌లో కొనసాగించాలని ఆయన కుమారుడు పుట్టపాక రవీంద్రనాథ్ అన్నారు. అనంతరం ప్రముఖ రచయితలను సన్మానించారు. కార్యక్రమంలో ఐక్యత సమాజ సంస్థ అధ్యక్షుడు నరసింహ, నరసింహులు, కవులు కళాకారులు పాల్గొన్నారు.

పురాతన మానవులు గీసిన చిత్రాలు లభ్యం