
గోదారోళ్లకు ధీటుగా మనోళ్లు
101 రకాల వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం
మేం తెలంగాణోళ్లం.. గోదారోళ్లకంటే తక్కువేం కాదంటూ నిరూపించారు కొత్తకోటకు చెందిన ఓ దంపతులు. దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటలతో విందు భోజనం వడ్డించి ఆకట్టుకున్నారు. కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేశ్, సహన దంపతుల కూతురు గుంత సింధును వరంగల్‌కు చెందిన నిఖిత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత మొదటిసారి దసరా పండుగకు అల్లుడు ఇంటికి రాగా.. గోదావరి స్టైల్లో అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే 101 రకాల శాకాహార పిండి వంటలను సిద్ధం చేసి కొత్త అల్లుడికి వడ్డించారు. అత్తామామలు ఎంతో ఇష్టంగా తయారు చేసిన 101 రకాల పిండివంటల్లో ఒక రకం తగ్గడంతో పెనాల్టీగా తనకు తులం బంగారం ఇవ్వాలని అల్లుడు మారం చేయగా.. కూతురికి, అల్లుడికి ఒక తులం బంగారం ఇవ్వక తప్పలేదు. ఈ విషయం శుక్రవారం కొత్తకోటలో చర్చనీయాంశంగా మారింది.
– కొత్తకోట