
ప్రజలు స్నేహభావంతో మెలగాలి
వీపనగండ్ల: పల్లెల్లోని ప్రజలు స్నేహభావంతో మెలిగినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కల్వరాలలో జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయను శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో యువత పాల్గొనడంతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సింగిల్‌విండో డైరెక్టర్ నర్సింహ, నాయకులు రామేశ్‌గౌడ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.