
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈనెల 2వ తేదీన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్యసమాజ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేకత ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా కొన్నేళ్ల నుంచి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ఆర్యసమాజ్‌లో దేవయజ్ఞం ఉంటుందన్నారు. కలకొండ సూర్యనారాయణ ధ్వజధారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్యసమాజ్ నుంచి ఊరేగింపు ఉంటుందన్నారు. దేవతామూర్తుల వేషధారణలు, కోలాట ప్రదర్శన, చెక్క భజనలతో శోభాయాత్ర బయలుదేరుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు దసరా కట్ట వద్ద ఓం పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగీతాలు, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అనంతరం దసరా ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మురళీధర్‌రావు, డాక్టర్ భరద్వాల నారాయణరావు, సీహెచ్ చంద్రయ్య, చంద్రకుమార్‌గౌడ్, గోపాల్‌యాదవ్, కేఎస్ రవికుమార్, మాల్యాద్రిరెడ్డి, అంజయ్య, సుధాకర్‌రెడ్డి, మోహన్‌యాదవ్, సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్, లక్ష్మణ్, గౌలి వెంకటేశ్, రాంచంద్రయ్య, నిరంజన్‌చారి పాల్గొన్నారు.