
మోగిన నగారా..
● 2 విడతల్లో ప్రాదేశిక.. 3 దఫాల్లో పంచాయతీ సమరం
● అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ
● ఉమ్మడి జిల్లాలో 77 జెడ్పీటీసీ.. 800 ఎంపీటీసీ స్థానాలు
● 1,678 గ్రామ పంచాయతీలు.. 15,068 వార్డులకు ఎన్నికలు
● గ్రామాల్లో రాజకీయ సందడి.. గెలుపే లక్ష్యంగా పార్టీల కసరత్తు
ఆశావహుల జోరు.. నేతల బేజారు
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మండలాలు, గ్రామాల్లోని మిగతా వర్గాలకు సంబంధించిన ఆశావహులు ఎక్కువ సంఖ్యలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వారికి సర్దిచెప్పలేక ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో రిజర్వేషన్ల తారుమారుతో భంగపడిన ఆశావహులది మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో పాత, కొత్త నాయకుల పంచాయితీలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి నెలకొనగా.. ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
పల్లె పోరుకు సై..