
20 ఏళ్ల లోపు వ్యక్తులకు గుండెపోటు
20 ఏళ్ల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. నేడు మారిన జీవన శైలితో 20 ఏళ్ల యువకుల నుంచి 70ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. 30 ఏళ్ల యువకులు అధికంగా ఉంటున్నారు. ఒత్తిడి, ధూ మపానం, మద్యం, షుగర్, బీపీ, లావు, చెడు కొలస్ట్రాల్ పెరగడం ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. – సంపత్‌కుమార్ సింగ్,
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, నారాయణపేట
చిన్న వయస్సు వారికి పెరిగాయి
గుండెపోటు ఒకటే సమస్య కాదు. లయబద్ధంగా కొట్టుకోకపోవడం, చిన్న వయసులో జనటిక్ సమస్యలతో గుండె బలహీనపడుతోంది. కరోనా తర్వాత చిన్న వయస్కులు, అందులో పురుషులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. బేకరిఫుడ్, బిర్యానీ, మాంసం తక్కువగా తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. జిల్లాలో కొవిడ్ కారణంగా ఽ50నుంచి 60శాతం గుండె నొప్పి సమస్యలు పెరిగాయి.
– బాలశ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్
పంచ సూత్రాలు పాటించాలి
కొందరిలో పుట్టినప్పటి నుంచే గుండె కండరాలు కొంత లావుగా ఉండడంతో సడెన్‌గా రన్నింగ్, డ్యాన్స్, జిమ్ చేస్తే గుండెపోటు వస్తోంది. ప్రతిరోజూ 6నుంచి 7గంటల నిద్ర, గంట వ్యాయామం, సరైన ఆహారం, 3–4లీటర్ల నీరు తాగడం, ప్రశాంతమైన జీవనం గడపాలి. ప్రజావాసాల్లో ఎయిడ్ సిస్టమ్స్ ఏర్పాటుతోపాటు సీపీఆర్‌పై అవగాహన పెరగాలి.
– మహేశ్‌బాబు, గుండె వైద్యునిపుణుడు
●

20 ఏళ్ల లోపు వ్యక్తులకు గుండెపోటు

20 ఏళ్ల లోపు వ్యక్తులకు గుండెపోటు