
స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసుకుందాం
మహబూబ్‌నగర్‌ను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో విన్నర్, రన్నరప్, మూడోస్థానం నిలిచిన జట్లకు ఆయన ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో ఈ ఏడాది పలు రాష్ట్రస్థాయి టోర్నీలు నిర్వహించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో క్రీడా వసతుల ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో టోర్నీలు నిర్వహించడానికి ముందుకు వచ్చే వారికి అన్ని విధాల వసతులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి జీపీ ఫాల్గుణ మాట్లాడుతూ.. వర్షం వచ్చినప్పటికీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన మహబూబ్‌నగర్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటే వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఉపాధ్యక్షులు రమేష్, రంగారావు, శంకర్‌లింగం, గజానంద్‌కుమార్, రాష్ట్ర సంఘం కోశాధికారి గణపతి, వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్‌రెడ్డి, నాగేశ్వర్, నందకిషోర్, జేమ్స్ ఇమ్మాన్యుయేల్, రామకృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసుకుందాం