
తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి
మోమిన్‌వాడి పాఠశాలకు వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడ ధ్వంసమైంది. పెద్ద నాలాదీ అదే పరిస్థితి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ గల్లీ లోపలికి వెళ్లాలంటేనే ఆందోళనగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎప్పుడు ఏమవుతోందని భయమేస్తుంది. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం దక్కడం లేదు. ఇప్పటికై నా సీసీరోడ్డుతో పాటు వరదకాల్వను పటిష్టంగా నిర్మించాలి. అవసరమైతే గోడ లేదా పెద్ద జాలీ ఏర్పాటు చేయాలి.
– పాషా, రిటైర్డ్ కానిస్టేబుల్,
గోల్ మసీదు ప్రాంతం
అసలే మా ప్రాంతం గుట్టపై ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టిరోడ్డు కాస్తా బురదమయంగా మారుతోంది. మోరీలు లేకపోవడంతో అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. నెల రోజుల క్రితం మా పెద్దబ్బాయి డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడే కోలుకున్నాడు. సీసీ రోడ్డు వేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ వచ్చి కొంత భాగం చదును చేసి వెళ్లిపోయారు. ముందుగా డ్రెయినేజీ నిర్మించాలని కోరడంతో మళ్లీ ఇటువైపు రానేలేదు. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. – రుక్మిణి, గృహిణి,
కల్వరికొండ, న్యూమోతీనగర్
నగర పరిధిలో చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేస్తాం. ఆయా డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నది వాస్తవమే. నిధుల మంజూరును బట్టి దశల వారీగా అన్ని పనులు చేపడతాం. ముఖ్యంగా ఆస్తిపన్ను, నల్లా బిల్లులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి అందరూ సహకరించాలి.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి,
కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్
●

తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి

తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి