
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. ఉమ్మడి జిల్లాలో అనేక దర్శనీయ స్థలా లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతం, జూరాల ప్రాజె క్టు, పిల్లలమర్రి, సోమశిల, కోయిల్‌సాగర్, సరళసాగర్, జోగుళాంబ శక్తిపీఠం, కురుమూర్తి, మన్యంకొండ వంటి ప్రసిద్ధ ఆలయాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయన్నారు. అలాగే సంస్థానాధీశులు కట్టించిన అనేక కోటలు, ప్రకృతి రమణీయ స్థలాలు, వ్యూ పాయింట్స్ సైతం అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల ద్వారా ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, సంస్కృతి భావితరాలకు తెలుస్తుందన్నారు. పర్యాటక ప్రదేశాలలో స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని, పర్యాటక ప్రాంతాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటేనే ఎక్కువ మంది వస్తారన్నా రు. జిల్లా పర్యాటకశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పిల్లలమర్రిని ఇటీవల ప్రపంచ సుందరీమణులు సందర్శించారని, బతుకమ్మ ఉత్స వాల్లో భాగంగా పర్యాటక కేంద్రం పిల్లలమర్రిలో ఈ నెల 22న బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు. అనంతరం బాలకేంద్రం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టీఎస్‌ఎస్ కళాకారులు మహబూబ్‌నగర్ పర్యాటకంపై పాటలు పాడి అలరించారు. ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపి కలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఐఎస్‌ఓ కౌసర్ జహాన్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనాబేగం, పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, పౌర సరఫరాల డీఎం రవి నాయక్, గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, టీఎన్‌జీఓ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.