
నగల దుకాణంలో చోరీ
● గోడకు కన్నం వేసిన దొంగలు
● 7 కేజీల వెండి, తులంన్నర
బంగారం అపహరణ
మక్తల్: గుర్తు తెలియని వ్యక్తులు జూవెలర్స్‌లో దొంగతనానికి పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్ట ణంలో బస్టాండ్ సమీపంలోని మహాలక్ష్మి జూవెలర్స్‌లో షాపు వెనుక భాగం గోడకు రంధ్రం చేసి లా కర్లలోని 7 కేజీల వెండి, తులంన్నర బంగారం, రూ.30 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. అదే విధంగా పక్కన ఉన్న పానీపూరి షాపులో రూ.6 వే లు నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం షాపుల యాజమానులు షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. జూవెలర్స్ యాజమాని రఘు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, నారాయణపేట క్లూటీం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. జూవెలర్స్ యాజమాని రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.