
జలపాతం.. కనువిందు
నల్లమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో వర్షానికి పాపనాశిని గుండం కొండపై
నుంచి జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. అక్కడ ప్రకృతి రమణీయత సంతరించుకోవడంతో శుక్రవారం పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకొని సందడి చేశారు. యువత కేరింతలు కొడుతూ జలపాతం చిత్రాలను తమ
సెల్‌ఫోన్‌లో బంధించారు. కాగా, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు.
– అచ్చంపేట రూరల్